హైకోర్టులో కేటీఆర్కు ఊరట..! 1 y ago
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊరట లభించింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పై నమోదైన కేసును కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిను కించపరిచే విధంగా కేటీఆర్ మాట్లాడారని ఎంపీ అనిల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసును కొట్టివేసినట్లు ఉత్తర్వులు జారీ చేసింది.